శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (20:34 IST)

'ఒరేయ్ బుజ్జిగా' నీకిది తగునా? హీరోయిన్‌తో డేటింగ్!!? (Video)

తెలుగు చిత్రపరిశ్రమలోని కుర్ర హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. ఈయన నటించిన తాజా చిత్రం "ఒరేయ్ బుజ్జిగా". అక్టోబరు రెండో తేదీన ఆహా ఓటీటీలో  విడుదలకానుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది ప్రతి ఒక్కరినీ ఆలరించేలా హాస్యంతో పాటు... భావోద్వేగభరితంగా తీసినట్టుగా ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా హెబ్బా పటేల్, మాళవికా అయ్యర్‌లు నటించారు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మించారు.
 
అయితే, ఈ చిత్ర హీరో రాజ్ తరుణ్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా, ఒరేయ్ బుజ్జిగా చిత్రంలో హీరోయిన్లలో ఒకరైన హెబ్బా పటేల్‌తో రాజ్‌ తరుణ్ డేటింగ్‌లో ఉన్నట్టు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త గుప్పుమన్నది. దీనికి కారణం హెబ్బా పటేల్ చేసిన వ్యాఖ్యలే. తన కెరీర్లో 90 శాతం రాజ్ తరుణ్‌తో కలిసే నటించానని, ఇపుడు కూడా ఇద్దరం కలిసే ఉంటున్నామని హెబ్బా పటేల్ చెప్పుకొచ్చింది. అంటే.. వీరిద్దరూ డేటింగ్ చేస్తూ కలిసి ఉన్నట్టుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.