గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 15 మే 2020 (17:27 IST)

సిమ్రాన్ రీ ఎంట్రీ, ఇంతకీ ఏ సినిమాలో తెలుసా?

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్... చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... ఇలా సీనియర్ హీరోల సరసన ఎన్నో సక్సెస్‌ఫుల్ మూవీస్‌లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే... పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకుని తమిళ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చింది. 
 
తెలుగులో కూడా రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడు..? ఏ సినిమా ద్వారా సిమ్రాన్ రీ-ఎంట్రీ ఇవ్వనుంది అనేది ఇన్నాళ్లు బయటకు రాలేదు.
 
 తాజాగా సిమ్రాన్ టాలీవుడ్‌లో రీఎంట్రీ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా పరిచయమై.. తొలి సినిమాతోనే సక్సస్ సాధించి మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న రాజ్ తరుణ్ మూవీలో సిమ్రాన్ రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. 
 
సంతోష్ మోహన్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఓ సినిమా చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. స్ర్కిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుందని తెలిసింది. 
 
ఇంతకీ.. సిమ్రాన్ క్యారెక్టర్ ఏంటంటే... ఒక కీలకమైన పాత్రను పోషిస్తుందని.. క్యారెక్టర్ బాగా నచ్చడం వలనే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారని టాక్. మరి.. రీఎంట్రీతో సిమ్రాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.