గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (15:21 IST)

నేను తల్లిని కాబోతున్నానా? అందుకే నటిని అయ్యాను.. అనుష్క శర్మ

తల్లిని కాబోతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని అనుష్క శర్మ తెలిపింది. తనకు నటన అంటే ఇష్టమని.. డబ్బులు సంపాదించడానికి నటించట్లేదని.. కేవలం యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అందుకే నటిని అయ్యానని వెల్లడించింది. 
 
ప్రస్తుతం తాను సినిమాలు చేయడం లేదంటే దానికి కారణం తనకు నచ్చిన కథ దొరకడం లేకపోవడమే. తనకు నచ్చిన కథ దొరికితే నటించడం, నిర్మించడం చేస్తానని తెలిపింది. త్వరలోనే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నానని అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. 
 
అనుష్క శర్మ కొంత విరామాన్ని తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే సినిమాలను తగ్గించుకుంది. అయితే ఆమె తల్లి కావడానికే విరామం తీసుకున్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై అనుష్క శర్మ ఫైర్ అయ్యింది. అవన్నీ వదంతులని అనుష్క శర్మ కొట్టి పారేసింది. 
 
ఇకపోతే.. విరాట్‌-అనుష్కల పెళ్లి డిసెంబర్‌ 11న ఇటలీలోని ప్రఖ్యాత టస్కనీ నగరానికి సమీపంలో.. 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్‌లో వైభవోపేతంగా జరిగిన విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది.