మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 22 మార్చి 2020 (22:17 IST)

చిరు, అల్లు అరవింద్ మధ్య ఏం జరిగింది? ఎందుకు సినిమా చేయడం లేదు?

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే.. చిరంజీవి రీ ఎంట్రీ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన అల్లు అరవింద్ నిర్మించాలి అనుకున్నారు కానీ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ స్టార్ట్ చేసి తండ్రి చిరంజీవి రీ ఎంట్రీ మూవీని తనే నిర్మించారు. 
 
ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి చేసే చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించాలి అనుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ ఓ సందర్భంలో మీడియాకి చెప్పడం కూడా జరిగింది. దీంతో గీతా ఆర్ట్స్ చిరంజీవి 151వ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి సరైనోడు అనే సినిమా చేసారు.
 
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో అల్లు అరవింద్.. బోయపాటిని చిరంజీవి ఇమేజ్ తగ్గ కథను రెడీ చేయమన్నారని.. చిరు - బోయపాటి కాంబినేషన్లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ.. అలా జరగలేదు. చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాని కూడా కొణిదెల ప్రొడక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణే నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన సైరా నరసింహారెడ్డి చిత్రం తెలుగు రాష్ట్రాల్లోను ఓవర్సీస్ లోను సంచలన విజయం సాధించింది.
 
చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి ఈ రెండు చిత్రాలు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లోనే రూపొందాయి. ఇప్పుడు ఆచార్య... సినిమాని కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానరే నిర్మిస్తుంది. 
 
ఈ విధంగా చిరంజీవి తన సొంత నిర్మాణ సంస్థలోనే సినిమాలు చేస్తున్నారు కానీ.. బయట సంస్థల్లో సినిమాలు చేయడం లేదు. దీంతో గీతా ఆర్ట్స్‌లో చిరంజీవి సినిమా ఉంటుందా..? ఉండదా..? అనేది ఆసక్తిగా మారింది. ఆచార్య తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో చిరంజీవి సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి... గీతా ఆర్ట్స్ బ్యానర్లో చిరంజీవి ఎందుకు సినిమా చేయడం లేదో..? గీతా ఆర్ట్స్‌లో చిరు మూవీ ఎప్పుడు ఉంటుందో..? త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.