గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (11:17 IST)

చిరు, పవన్, అఖిల్‌కి.. అది భలే కలిసొచ్చింది..!

ప్రస్తుతం కరోనా ఎంతటి కల్లోలం సృష్టిస్తుందో తెలిసిందే. ఈ వైరస్ ను అరికట్టడానికి సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, షూటింగ్స్ మూసివేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ... తెలుగు సినిమా పరిశ్రమ షూటింగ్స్ ను మార్చి 31 వరకు ఆపేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్న సినిమాల రిలీజ్ డేట్స్ మొత్తం మారుతున్నాయి. 
 
ఏప్రిల్, మే నెలలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఇప్పుడు చెప్పలేని పరిస్ధితి. ఇదిలా ఉంటే.. షూటింగ్స్ ఆపేయడం చిరు, పవన్, అఖిల్ కి బాగా కలిసొచ్చింది. అదేంటి.. సినిమా షూటింగ్స్ ఆపేయడం వీళ్లకు కలిసి రావడం ఏంటి..? అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే... మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తుంటే... ఇప్పటి వరకు రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. ఈ మూవీని ఆగష్టు 14న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ప్రస్తుతం షూటింగ్ ఆగిపోవడం వలన ఆ డేట్ కు రావడం కష్టమే. అయితే.. ఈ సినిమాలో నటించేందుకు త్రిష నో చెప్పడంతో వేరే హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారు. 
 
కాజల్ అగర్వాల్ ని సంప్రదించడం.. ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.అయితే.. అఫిషియల్ గా ఇంకా ఎనౌన్స్ చేయలేదు. ఈ సినిమా ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి ఈ గ్యాప్ లో కథ పై మరోసారి కసరత్తు చేయమని చెప్పారని టాక్. అలాగే ఈమధ్య రిలీజ్ అయిన సినిమాలు చిరంజీవి చూడలేదు. 
 
ఈ గ్యాప్ లో వరుసగా ఇటీవల రిలీజైన సినిమాలు చూస్తూ.. తనకు నచ్చిన సినిమాల దర్శకులను, హీరోలను అభినందిస్తున్నారు. రీసెంట్ గా భీష్మ సినిమా చూసి దర్శకుడు వెంకీ కుడుములను అభినందించిన విషయం తెలిసిందే. ఈ షూటింగ్ బ్రేక్ ని చిరు ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు.
 
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్.ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి బ్రేక్ అనేది లేకుండా షూటింగ్ చేసి చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకున్నారు. అయితే.. ఇప్పడు షూటింగ్ ఆపేయడంతో పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాల పై దృష్టి సారించారు. ఈ గ్యాప్ ను ను ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు పవన్ కళ్యాణ్‌. 
 
మార్చి 21 నుంచి వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొనాలి అనుకుంటున్నారు. మరి.. మార్చి 21న పవన్ షూటింగ్ లో పాల్గొంటారా..? లేదా ..? అనేది తెలియాల్సివుంది. అక్కినేని అందగాడు అఖిల్ నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల చెన్నైలో జరిగింది. అఖిల్ పై యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుంటే... చేతికి గాయాలు అయ్యాయి. దీంతో అఖిల్ రెస్ట్ తీసుకుంటున్నాడు. షూటింగ్ కి బ్రేక్ పడడం అఖిల్ కి కలిసొచ్చింది. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న అఖిల్ ఏప్రిల్ నుంచి షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
ఈ సినిమాని మే రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ... ప్రస్తుత పరిస్థితులు బట్టి మే నెలలో కాకుండా జూన్ లేదా జులైకి వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. ఈ విధంగా షూటింగ్స్ బ్రేక్ రావడం చిరు, పవన్, అఖిల్ కి భలే కలిసొచ్చింది.