సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 16 మార్చి 2020 (17:42 IST)

చైతు లవ్ స్టోరీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్ డేట్స్ ఫిక్స్

యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ లవ్ స్టోరీ నుండి ఇటీవల విడుదలైన 1 మినిట్ మ్యూజికల్ ప్రివ్యూ.. ఏయ్ పిల్లా అనే సాంగ్ ప్రివ్యూకు మంచి ఆదరణ లభించింది. అలాగే రీసెంట్ గా రిలీజైన ఏయ్ పిల్లా ఫుల్ లిరికర్ వీడియోకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
 
చైతన్య పింగళి ఈ సాంగ్‌కు అద్భుతమైన సాహిత్యం అందించారు. పవన్ సి. హెచ్ అందించిన సంగీతం ఇంస్టెంట్ హిట్‌గా నిలిచింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న లవ్ స్టొరీ మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 
 
అయితే.. ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేస్తున్నట్టు ఎనౌన్స్ చేసారు కానీ.. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఎనౌన్స్ చేయలేదు.
 
తాజా సమాచారం ప్రకారం.. ఈ లవ్ స్టోరీని మే 29న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అఫిషియల్‌గా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయనున్నారు. ఇక మరో అక్కినేని అందగాడు అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. 
 
ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యువ నిర్మాతలు బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 
 
ఇటీవల ఈ సినిమాలోని మనసా మనసా సాంగ్‌ను రిలీజ్ చేసారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు సురేంద్ర కృష్ణ సాహిత్యాన్ని అందించగా..  గోపీ సుందర్ సంగీతం అందించారు. ఈ పాట విన్న వెంటనే నచ్చేట్టు ఉండడంతో యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకెళుతుంది. ఈ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు కానీ.. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రావడం లేదని టాక్ వినిపిస్తోంది. 
 
ఇటీవల చెన్నైలో అఖిల్ పైన యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. ఈ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు అఖిల్‌కి గాయాలు అయ్యాయి. దీంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. రీసెంట్‌గా మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసారు. అయితే.. ఈ మూవీని ఏప్రిల్‌లో కాకుండా.. మే 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.