మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (19:51 IST)

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఫస్ట్ సింగిల్ బాగుందా..? బాగాలేదా..?

అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై యువ నిర్మాతలు బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఆడియో ఆల్బమ్ నుంచి ఇటీవల మొద‌టి పాట‌ను విడుద‌ల చేశారు. బ్లాక్ బస్టర్ మూవీ గీత గొవిందం చిత్రంలో ఇంకేం… ఇంకేం…. ఇంకేం… కావాలి…. అనే సెన్సేష‌న‌ల్ సాంగ్‌ని అందించిన మ్యూజిక‌ల్ కాంబోని మళ్ళీ ఈ చిత్రం ద్వారా రిపీట్ చేశారు.
 
మ‌న‌సా…. మ‌నసా… మ‌న‌సారా… బ్ర‌తిమాలా..  అంటూ సాగే ఈ సాంగ్ ప్ర‌స్తుతం ట్రెండ్ అవ్వడ‌మే కాకుండా యూట్యూబ్‌లో త‌క్కువ టైంలోనే ట్రెండింగ్‌కి రావ‌టం విశేషం. 3 మిలియ‌న్ వ్యూస్ దాటి 5 మిలియ‌న్ దిశగా పరుగులు తీస్తుంది. జీఏ 2 బ్యాన‌ర్ నుంచి గ‌తంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ గీత‌గోవిందం ఆడియో ఒక సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. మ‌ళ్లీ అదే కాంబినేష‌న్లో వస్తున్న ఈ సినిమా ఆడియో కూడా అదే స్ధాయిలో విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు. 
 
గోపీసుంద‌ర్ కంపోజ్ చేసిన ఈ ఆల్బ‌మ్ లో సిడ్ శ్రీరామ్ పాడిన ఈ పాట మంచి స‌క్స‌స్ సాధించ‌డం యూనిట్ న‌మ్మ‌కాన్ని నిజం చేసినట్టు అయ్యింది. ఈ పాటకి ఎన్నో మంచి పాట‌ల‌కి సాహిత్యాన్ని అందించిన సురేంద‌ర్ కృష్ణ లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. శరవేగంగా షూటింగ్ చేస్తున్న ఈ మూవీ కోసం అఖిల్, పూజా హేగ్డేలపై ఓ పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
ఈ మూవీ కథ విషయానికి వస్తే... ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు పెళ్లి చేసుకోవడం కోసం ఇండియా రావడం.. అక్కడ కథానాయిక పరిచయం కావడం.. పెద్దలు అంగీకారంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న టైమ్‌లో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇక అక్కడ నుంచి కథ ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లతో ముందుకు వెళుతుంది.
 
ఇప్పటి వరకు రాని ఓ కొత్త పాయింట్ తో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని.. ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుని.. అఖిల్ కి మంచి విజయాన్ని అందిస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. 
 
అయితే... ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల అని ప్రకటించారు కానీ.. ఇప్పటివరకు రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఎనౌన్స్ చేయలేదు. ఫస్ట్ సింగిల్ సక్సస్ కావడంతో అభిమానులు సినిమా విజయంపై కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా అఖిల్‌కి మంచి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.