మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 18 మార్చి 2020 (18:19 IST)

పవన్ కళ్యాణ్‌ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ ప్లాన్ నిజమేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వకీల్ సాబ్ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక వరుసగా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వకీల్ సాబ్ మూవీ సెట్స్ పైన ఉండగానే... క్రిష్ డైరెక్షన్లో ఓ భారీ చిత్రం చేయడానికి ఓకే చెప్పడం.. షూటింగ్ స్టార్ట్ చేయడం తెలిసిందే. పిరియాడిక్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. 
 
భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆల్రెడీ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో షూటింగ్ ప్లాన్ చేసారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌ క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం. పవన్‌తో చేస్తున్న ఈ సినిమాతో భారీ విజయం సాధించాలని క్రిష్ ఎంతో పట్టుదలతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో సినిమా చేయడానికి పవన్ ఓకే చెప్పారు. పవన్ - హరీష్ శంకర్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇటీవల ఈ మూవీని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. ఈ ఇయర్ ఎండింగ్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. వేణు శ్రీరామ్‌తో వకీల్ సాబ్, క్రిష్, హరీష్ శంకర్‌లతో సినిమాలు చేయడానికి ఓకే చెప్పారు. ఈ మూడు సినిమాలే కాకుండా మరో ఇద్దరు దర్శకులకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. 
 
ఆ ఇద్దరు ఎవరంటే.. ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే.. మరొకరు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. 
 
ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని సినిమా తొలిప్రేమ. ఈ సినిమా ద్వారా కరుణాకరన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుని సంచలన విజయం సాధించింది. ప్రేమకథా చిత్రాల్లో మొదటి వరుసలో ఉండే తొలిప్రేమ ఇప్పటి తరాన్ని కూడా విశేషంగా అరిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రానుందని వార్తలు వస్తున్నాయి. 
 
తాజా సమాచారం ప్ర‌కారం… ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ తొలిప్రేమ‌ చిత్రాన్ని కొన‌సాగించే దిశ‌గా స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారని.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఈ మేర‌కు చ‌ర్చ‌లు జరిపినట్టు తెలిసింది. స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌టంతో ప‌వ‌న్ కూడా ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సీక్వెల్ పైన ఫుల్ క్లారిటీ వ‌స్తుంది.