శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మే 2020 (12:12 IST)

వామ్మో.. మహేష్ బాబుతోనా... నో చెప్పిన కియారా అద్వానీ

బాలీవుడ్ నటి కియారా అద్వానీ. తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది. అందులో ఒకటి హీరో రాం చరణ్ నటించిన "వినయ విధేయ రామ". రెండోది.. ప్రిన్స్ మహష్ నటించిన "భరత్ అనే నేను" చిత్రాల్లో నటించింది. అయితే, భరత్ అనే నేను చిత్రం సూపర్ డూపర్ హిట్ట్ అయింది. కానీ, ఈ రెండు చిత్రాల్లో ఈ అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డాయి. 
 
ఈ నేపథ్యంలో తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. అదేసమయంలో బాలీవుడ్‌లో మాత్రం వరుస ఆఫర్లతో చాలా బిజీగా ఉంది. దీంతో కియారా అద్వానీ బాలీవుడ్‌కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రిన్స్ మహేష్ బాబుతో నటించే ఛాన్స్ మరోమారు వచ్చింది. కానీ, ఈ అమ్మడు నిర్ధాక్షిణ్యంగా నో చెప్పేసింది. 
 
మహేష్ బాబు - పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుత పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు కియారాని సంప్రదించారట. 
 
ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో నాలుగైదు సినిమాలు చేస్తూ క్షణం కూడా తీరికలేనంత బిజీగా ఉండటంతో ఈ చిత్రంలో చేయడానికి నిరాకరించిందట. దీంతో మరో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ గాలిస్తోందట.