శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (14:34 IST)

హెబ్బా పటేల్ మాయలో నితిన్ ... మరోసారి బుక్‌చేసుకున్న హీరో

తెలుగు చిత్రసీమలో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరు. ఈమెకు ఇటీవలి కాలంలో పెద్దగా సినీ అవకాశాలు లేవు. కానీ, రెండో హీరోయిన్‌గా, గెస్ట్ అప్రీరెన్స్‌గా మాత్రం అవకాశాలు బోలెడన్నీ వస్తున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం 'భీష్మ'. ఈ చిత్రంలో ఓ చిన్నపాత్రలో హెబ్బా పటేల్ కనిపించింది. ఇపుడు నితిన్ మరోమారు చిత్రం చేయనున్నాడు. ఇందులో కూడా హెబ్బా పటేల్‌కు మరో అవకాశం ఇచ్చాడీకుర్రహీరో. 
 
హెబ్బా పటేల్‌కే వరుస ఆఫర్లు ఇవ్వడంపై హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్దగా ఫామ్‌లోని హెబ్బా పటేల్‌కు నితిన్ వరుసగా ఎంపిక చేయడానికి కారణం ఏమైవుంటుందా అని ఆలోచనలు చేస్తున్నారు. 
 
కాగా, ప్రస్తుతం హీరో నితిన్ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఈ మూడింటిలో నితిన్ ఏ సినిమాలో హెబ్బా ప‌టేల్‌కు అవ‌కాశం ఇచ్చాడో తెలుసుకోవాలంటే వెయిటింగ్ త‌ప్పేలా లేదు. నితిన్ లేటెస్ట్ మూవీ 'రంగ్‌దే' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.