సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (14:55 IST)

నితిన్ నిశ్చితార్థం జరిగిపోయిందోచ్.. ఏప్రిల్ 16న దుబాయ్‌లో వివాహం

Nithin
టాలీవుడ్ హీరో నితిన్ ఓ ఇంటివాడు కానున్నాడు. ఏప్రిల్ 16న దుబాయ్‌లో నితిన్ వివాహం జరుగనుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీ (శనివారం) హైదరాబాదులో షాలిని అనే అమ్మాయితో నితిన్ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుక అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఏప్రిల్ 16న దుబాయ్‌లో వివాహం, ఆపై హైదరాబాదులో గ్రాండ్‌గా రిసెప్షన్ వుంటుందని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం నితిన్, షాలినిల నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నితిన్ పెళ్లి చేసుకుంటున్న షాలిని ఓ డాక్టర్ అని వీరిద్దరికీ 2012లో పరిచయం కాగా, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారి ప్రేమకి ఇరువురు కుటుంబాలు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు ఒక్కటయ్యారు.  
 
2002 లో జయం సినిమాతో వెండితెరకి పరిచయం అయిన నితిన్ హీరోగా మొదట్లో మంచి విజయాలను అందుకున్నాడు. ఆ తరవాత కొన్ని అపజయాలు వచ్చినప్పటికి మళ్ళీ ఇష్క్ సినిమాతో నిలదొక్కుకొని వరస సినిమాలతో హిట్స్ కొడుతున్నాడు. తాజాగా నితిన్ నటించిన భీష్మ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21 న విడుదల కానుంది. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.