సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (14:52 IST)

బిల్ గేట్స్ కుమార్తెకు మంచుకొండల్లో ఎంగేజ్‌మెంట్.. ఫోటో వైరల్

మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ తన కుమార్తెకు వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపనున్నారు. బిల్, మెలిండా దంపతుల కుమార్తె జెన్నీఫర్ గేట్స్ (23)కు హార్స్ రేసర్ నయెల్ నాసర్ (29)తో ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది.

అదీ మంచుకొండల్లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నయెల్ నాసర్, జెన్నీఫర్ గేట్స్ ప్రేమలో వున్నారు. వీరి పెళ్లికి బిల్ గేట్స్ అంగీకరించారు. 
 
ఈ మేరకు బిల్ గేట్స్ కుమార్తె ఇన్‌స్టాలో తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పోస్టు చేశారు. భవిష్యత్తులో ప్రేమను పంచుకుంటూ ముందడుగు వేస్తానని జెన్నీఫర్ తెలిపారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నామని చెప్పారు. ఈ  పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.

జెన్నీఫర్‌కు లైకులు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో మంది అభినందనలు తెలుపుతున్నారు.ఇక ప్రపంచంలో తన అంత అదృష్టవంతుడు మరొకరు ఉండబోరంటూ నయెల్ నాసర్ చెప్పారు.