శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 జనవరి 2020 (20:26 IST)

భీష్మలో అదరగొడుతున్న రష్మిక మందన్న-నితిన్

నితిన్, రష్మిక మందన్న జంటగా నటించిన భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో నిర్మాతలు ఈ చిత్రం ప్రమోషన్ ఈవెంట్లను షురూ చేశారు. ఓ శృంగార పాటతో సంగీత ప్రమోషన్లు ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈ పాటను ఈనెల 31న విడుదల చేయనున్నారు.
 
మొదటి సింగిల్ వాట్టే బ్యూటీ వీడియో ప్రోమో జనవరి 31న విడుదలవుతుంది. ప్రకటన పోస్టర్లో, నితిన్- రష్మిక ఫోటో ఓ రేంజిలో వుంది. రష్మిక షార్ట్ గౌనులో కనిపించి మరోసారి గ్లామర్ అదుర్స్ అనిపించుకుంటుంటే నితిన్ ఫ్యాన్సీ దుస్తుల్లో కనిపిస్తున్నాడు. మొత్తమ్మీద రష్మిక లక్కీయెస్ట్ హీరోయిన్ అనే ముద్ర వేసుకుంది. వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.