శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (11:30 IST)

హీరోయిన్ రష్మిక మందన్నాకు ఐటీ శాఖ షాక్... ఇంట్లో సోదాలు

కన్నడ భామ రష్మిక మందన్నాకు ఆదాయపన్ను శాఖ అధికారులు షాకిచ్చారు. కర్నాటక రాష్ట్రంలోని ఆమె నివాసంలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ముఖ్యంగా, కర్నాటకలోని కొడగు జిల్లా విరాట్‌పల్లిలో ఉన్న రష్మిక మందన్నా ఇంట్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 
 
నిజానికి రష్మిక మందన్నా కన్నడ భామ అయినప్పటికీ.. ఈమెకు మాతృభాషలో కంటే.. టాలీవుడ్‌లో విపరీతమైన అవకాశాలు వస్తున్నాయి. ఛలో మూవీతో తెలుగులోకి అరంగేట్రం చేసిన ఈ భామ.. గీతగోవింద చిత్రంతో మంచి ఫామ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రిన్స్ మహేష్ బాబు (సరిలేరు నీకెవ్వరు), విక్టరీ వెంకటేష్‌తో ఓ చిత్రంలో నటించగా, మరో కొత్త చిత్రంలో ఎంపికైంది. ఇలా వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది.