శుక్రవారం, 19 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (13:33 IST)

''భీష్మ'' హెబ్బాపటేల్‌దే కీలక రోల్.. అదరగొట్టేస్తుందట..

''భీష్మ'' సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాలో నితిన్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో హెబ్బాపటేల్ కీలక పాత్రలో కనిపిస్తోంది. 'కుమారి 21F' సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న హెబ్బా పటేల్, ఆ తరువాత ఒకటి రెండు సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా వరుస పరాజయాలు పలకరిస్తూ ఉండటంతో రేస్‌లో వెనుకబడిపోయింది. 
 
'భీష్మ' సినిమా మళ్లీ గుర్తింపు సంపాదించాలని భావిస్తోంది హెబ్బాపటేల్. ఆమె కెరీర్‌ను దృష్టిలో పెట్టుకునే భీష్మ దర్శకుడు అదిరిపోయే క్యారెక్టర్ ఇచ్చాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. కాగా నితిన్ కథానాయకుడిగా దర్శకుడు వెంకీ కుడుముల 'భీష్మ' సినిమాను తెరకెక్కించాడు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.