శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (11:21 IST)

హగ్గింగ్ కోసం భీష్మ పడే పాట్లు.. వీడియో వైరల్

#SinglesAnthem
ప్రేమికుల రోజు సందర్భంగా భీష్మ సినిమా నుంచి సింగిల్స్ యాంథమ్ వీడియో విడుదలైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. భీష్మ నుంచి సింగిల్స్ యాంథ‌మ్ అనే రొమాంటిక్ సాంగ్ విడుద‌ల చేశారు.

అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు మహతి స్వర సాగర్ అందించిన సంగీతం ప్లస్ అయింది. శ్రీమణి అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో నితిన్ లుక్ ఆకర్షణీయంగా ఉంది. హగ్గింగ్ కోసం వెయిటింగులే అంటూ నితిన్ పడుతున్న పాట్లు యువతను ఆకట్టుకుంటున్నాయి.
 
కాగా నితిన్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న కొత్త సినిమా భీష్మ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. త్వరలో విడుదలకు రంగం సిద్ధం అవుతోంది.