మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (14:48 IST)

ప్రేమికుల రోజు కానుకగా భీష్మ నుంచి సింగిల్స్ యాంథమ్

Bheeshma
టాలీవుడ్ స్టార్స్ నితిన్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనుల్లో వుంది. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిమీదున్నాడు నితిన్. 
 
ఇప్పటికే ఈ సినిమా టీజర్, విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రేమికుల రోజును పురస్కరించుకుని.. భీష్మ నుంచి సింగిల్స్ యాంథమ్ వీడియో విడుదల కానుంది. ఫిబ్రవరి 14వ తేదీ, ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేయనున్నట్లు సినీ యూనిట్ వెల్లడించింది.