శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (12:17 IST)

అబ్బే.. అదంతా ఉత్తుత్తి వార్తే... క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్

మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేరంగాసాగుతోంది. ఆచార్య అనే వర్కింట్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ సాగుతుంటే, ఇందులో చిరంజీవి స్నేహితుడు, సీనియర్ హీరో డాక్టర్ మోహన్ బాబు ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారనే వార్తల హల్చచల్ చేసింది. వినోదంతో పాటు సందేశంతో కూడిన ఈ మూవీ కథలో మోహన్ బాబు పాత్ర ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది.
 
ఈ ప్రచారంపై మూవీ యూనిట్ స్పందించింది. ఈ సినిమాలో మోహన్ బాబు నటించడం లేదని స్పష్టంచేసింది. మోహన్ బాబుకి తగిన పాత్ర తమ సినిమాలో లేదనీ, అలాంటి పాత్రే గనుక వుంటే తప్పకుండా సంప్రదించేవారమని వివరణ ఇచ్చింది. గతంలో చిరంజీవి - మోహన్ బాబు కలిసి నటించారు. మళ్లీ ఇంతకాలానికి ఈ ఇద్దరినీ ఒకే తెరపై చూడాలనుకునే అభిమానుల ఆశ. అయితే, చిత్ర యూనిట్ ఇచ్చిన క్లారిటీతో అది నిరాశే అయింది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనుపించనున్నాడనే సంగతి తెలిసిందే.