సంబంధిత వార్తలు
- బన్నీ, మహేష్‌తో మాస్ మహారాజా పోటీ.. క్రాక్‌లో వరలక్ష్మి, శ్రుతిహాసన్
- వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు.. కానీ పెళ్లంటూ జరిగితే?: త్రిష (video)
- ఎఫ్3లో మాస్ మహారాజ.. వెంకీ, వరుణ్‌కి రవితేజ తోడైతే ఇంకేమైనా వుందా?
- విలన్ పాత్రలను చేస్తానంటున్న మాస్ మహారాజా
- చిరంజీవికి ఏం తెలుసని 3 రాజధానులు అంటున్నారు.. షాకిచ్చిన మెగా ప్రొడ్యూసర్
టాలీవుడ్‌లో మకుటంలేని మహారాజు ఎవరు? రవితేజ చెప్పిన ఆన్సర్ ఏంటి?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రహీరోల్లో చిరంజీవి ఒకరు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్నారు. అలాంటి చిరంజీవి గురించి మాస్ మహాజారాగా గుర్తింపు పొందిన రవితేజ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అరవై యేళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోలతో పోటీపడుతూ చిత్రాలు చేస్తున్న చిరంజీవి అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. త్వరలో తన 152వ సినిమతో పలకరించనున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
అలాంటి చిరంజీవిపై మరో టాలీవుడ్ హీరో రవితేజ ప్రశంసలు కురిపించారు. రవితేజ నటించిన తాజా చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో నేనంటే 35 ఏళ్ళు ఐస్‌లో గడ్డ కట్టేసేలా ఉన్నాను. ఆయనేంటి ఇంకా అలానే ఉన్నారు అని రవితేజ.. వెన్నెల కిషోర్‌తో చెబుతాడు.
దీనికి వెన్నెల కిషోర్ ఐస్‌లో కాదు ఫ్యాన్స్ గుండెల్లో ఉన్నాడని అంటాడు. దీనికి సంబంధించిన డైలాగ్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియో నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన డిస్కోరాజా చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా, ఈ చిత్రం మరిన్ని వసూళ్ళు రాబట్టేందుకు మేకర్స్ వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు.
