సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2020 (13:07 IST)

విలన్ పాత్రలను చేస్తానంటున్న మాస్ మహారాజా

తెలుగు చిత్రపరిశ్రమలో మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న నటుడు రవితేజ. ఒకపుడు చిన్నబడ్జెట్‌, సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. దీంతో రవితేజ కోసం నిర్మాతలు క్యూకట్టారు. అయితే, ఇపుడు పరిస్థితి తారుమారైంది. ఆయన నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఈ క్రమంలో ఈనెల 24వ తేదీన 'డిస్కోరాజా' పేరుతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో నభా నటేష్, తాన్యా హోప్‌లు హీరోయిన్లుగా నటించారు. 
 
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ, 'గతంలో నేను చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తిభిన్నంగా ఉంటుంది. కథాకథనాలు.. దర్శకుడు వీఐ ఆనంద్ టేకింగ్ ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. మారిన ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ఈ సినిమా ఉంటుంది. కాన్సెప్టులోను.. పాత్రల్లోను కొత్తదనం వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తున్నారు. 
 
అలాంటి ప్రేక్షకుల కోసం విలన్‌గా కనిపించడానికి కూడా నేను సిద్ధమే. అయితే ఆ విలనిజం కొత్తగా ఉండాలి.. విభిన్నంగా ఉండాలి. అలాంటి విలన్ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను' అని ఈ మాస్ మహారాజా చెప్పుకొచ్చారు.