'రంగమ్మత్త'కు ఛాన్సిచ్చిన 'కత్తి శీను'
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సరిగ్గా వంద రోజుల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలన్న కండిషన్‌ను హీరో చిరంజీవి ఇటీవల పెట్టారు. దీంతో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష నటిస్తుంటే, మరో హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సివుంది. అయితే, ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం బుల్లితెర యాంకర్ అనసూయను ఎంపిక చేసినట్టు కొందరు, ఎంపిక చేయలేదని మరికొందరు వ్యాఖ్యానిస్తూ వచ్చారు. కానీ, ఈ వార్తలపై శుక్రవారం ఓ క్లారిటీ వచ్చింది.
తాజా సమాచారం చిరు 152వ చిత్రంలో అనసూయ నటించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇటు బుల్లితెరపైన రాణిస్తూనే అడపాదడపా వెండితెరపై మెరుస్తున్న అనసూయకి చిరు ప్రాజెక్టులో ఆఫర్ వరించడం ఆమె నక్క తోక తొక్కినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న "రంగమార్తాండ" చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.