శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (12:26 IST)

మహేష్ బాబు ఓ దొంగ : మెగాస్టార్ చిరంజీవి

ప్రిన్స్ మహేష్ బాబుపై మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మహేష్ బాబును ఓ దొంగగా వ్యాఖ్యానించారు. దొంగ అంటే.. చిలిపి దొంగ అని అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు" చిత్రం ప్రిరిలీజ్ వేడుక జరిగింది. దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకుని, జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుని సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నా హీరోయిన్ విజయశాంతి అంటూ ప్రసంగం మొదలుపెట్టారు.

హీరో మహేశ్ బాబు గురించి చెబుతూ, మహేశ్ ముఖంలో చెరగని చిరునవ్వు ఉంటుంది.. అయితే ఆ చిరునవ్వు వెనుక చిన్న చిలిపిదనం ఉంటుంది... దొంగ అంటూ వ్యాఖ్యానించారు. తక్కువ సినిమాలతోనే సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడంటూ ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిని అభినందించారు.
 
ఇకపోతే, 'ఇటీవల పేపర్ చూస్తుంటే మహేశ్ బాబు స్టిల్ ఒకటి కనిపించింది. మహేశ్ బాబు మిలిటరీ డ్రస్సులో ఉన్నాడు. చూడగానే కత్తిలా ఉన్నాడనిపించింది. నాకేదైనా మంచి ఫీలింగ్ కలిగితే వెంటనే మహేశ్‌తో షేర్ చేసుకుంటాను. ఎస్సెమ్మెస్ పెడితే వెంటనే స్పందించాడు. తను నటిస్తున్న కొత్త చిత్రం గురించి చెప్పాడు. 
అలా చెప్పాడో లేదో కొన్నినెలలకే షూటింగ్ కూడా పూర్తయింది, మీరే ముఖ్య అతిథిగా రావాలని నన్నడిగాడు. మరీ ఇంత ఫాస్ట్‌గా ఎలా తీయగలిగారని ఆశ్చర్యంగా ఉంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ వేగంగా సినిమాలు తీయడం అలవర్చుకోవాలి, తద్వారా చిత్ర పరిశ్రమలోని అందరూ కళకళలాడతారు.
 
మహేశ్ బాబు ఈ సినిమా పూర్తయ్యేవరకు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. అడ్వాన్స్ కూడా తీసుకోలేదు. అందువల్ల నిర్మాతలకు ఎన్నో కోట్ల రూపాయల వడ్డీ ఆదా అవుతుంది. నేను కూడా చిత్రం తర్వాతే తీసుకునేవాడ్ని, రామ్ చరణ్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు మహేశ్ బాబు అనుసరిస్తున్న పంథా నిర్మాతలకు ఊరట కలిగిస్తుంది. 
 
రెండంకెల వడ్డీకి బదులు ఒక్క అంకెతోనే బయటపడతారు నిర్మాతలు అంటూ తెలిపారు. ఇక తన కొత్త చిత్రం గురించి చెబుతూ, 99 రోజుల్లోనే తన సినిమా పూర్తి చేయాలంటూ అక్కడే ఉన్న దర్శకుడు కొరటాల శివకు సరదాగా ఆర్డర్ జారీ చేశారు. ఒక్కరోజు దాటినా సహించేది లేదంటూ మురిపెంగా హెచ్చరించారు.