చిరంజీవికి రాములమ్మ స్వీట్ వార్నింగ్... 'సరిలేరు నీకెవ్వరు'లో

Chiru-Ramulamma
ఐవీఆర్| Last Modified సోమవారం, 6 జనవరి 2020 (10:24 IST)
దాదాపు 20 ఏళ్ల తర్వాత చిరంజీవి- విజయశాంతి ఒకే వేదికపైన కన్పించి అభిమానులకు జోష్ నింపారు. వీళ్లిద్దరినీ ఒకే వేదికపైకి వచ్చేట్లు చేసింది మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రి-రిలీజ్ వేడుక. ఈ వేడుకకు హాజరైన చిరంజీవి-విజయశాంతి ఒకరిపై ఒకరు చిరు కామెంట్లు వేస్తూ వేడుకకు హైలెట్‌గా నిలిచారు.
Vijayasanti-Chiru-Mahesh
రాజకీయాల ప్రస్తావన కూడా ఇక్కడ వచ్చింది. చిరంజీవి మాట్లాడుతూ... నాకంటే ముందుగా రాజకీయాల్లోకి వెళ్లావు కదా... నన్ను అన్నెన్ని మాటలు అనాలని నీకెందుకు అనిపించింది, శాంతి అని చిరంజీవి అన్నారు. దీనిపై విజయశాంతి స్పందిస్తూ... చేయి చూశావుగా ఎంత రఫ్‌గా వుందో... రఫ్ఫాడించేస్తా జాగ్రత్త అని నవ్వుతూ రాములమ్మ చిరుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు... ఎప్పిటికీ మీరు నా హీరో, నేను మీ హీరోయిన్ అంతే అని విజయశాంతి భావేద్వోగానికి లోనయ్యారు.దీనిపై మరింత చదవండి :