సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (19:00 IST)

ఎఫ్3లో మాస్ మహారాజ.. వెంకీ, వరుణ్‌కి రవితేజ తోడైతే ఇంకేమైనా వుందా?

ఎఫ్-2 సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్‌కు హిట్ కలెక్షన్లకు కలెక్షన్లతో కుమ్మేసింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ రానుంది. ఎఫ్3తో వచ్చే ఈ సినిమా గురించి ఇప్పటికే విక్టరీ వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది. 
 
ఎఫ్2లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెంకీతో నటించాడు. ప్రస్తుతం ఎఫ్3లో మరో ఎనర్జిటిక్ హీరో నటించనున్నాడు. ఆయన ఎవరో కాదు.. మాస్ మహారాజ రవితేజ. వెంకటేష్, వరుణ్ లను 100 కోట్ల క్లబ్ జాయిన్ చేసిన ఈ సినిమా సీక్వెల్‌లో నటించేందుకు రవితేజ రెడీగా వున్నాడని తెలిసింది.  
 
టాలీవుడ్ వర్గాల ప్రకారం... ''ఎఫ్3''లో వెంకీ-వరుణ్‌తో పాటు రవితేజ కూడా జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ''సరిలేరు నీకెవ్వరు'' సక్సెస్ తర్వాత కొంత విరామం తీసుకొని "ఎఫ్3"ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు అనిల్ రావిపూడి. దిల్ రాజు నిర్మించనున్న ఈ సీక్వెల్లో మొదటి పార్ట్‌లో నటించిన తమన్నా, మెహరీన్‌లు కూడా ఇందులో నటిస్తారని తెలుస్తోంది. మరి సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందో తెలియాలంటే.. వేచి చూడాల్సిందే.