రవితేజ - శృతిహాసన్ ''క్రాక్" ప్రారంభం
మాస్ మహారాజ్ రవితేజ 66వ చిత్రానికి `క్రాక్` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో రవితేజ సరసన శృతిహాసన్ నటిస్తుంది. మలినేని గోపీచంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ మూవీ యాదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది.
హైదరాబాద్‌లో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు దిల్‌రాజు, డి.సురేష్‌బాబు, ఎన్.వి.ప్రసాద్, సురేందర్ రెడ్డి, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సుధాకర్ రెడ్డి, నవీన్ ఎర్నేని, పరుచూరి బ్రదర్స్, దాము, బీవీఎస్ఎన్ ప్రసాద్, రామ్ తాళ్లూరి లతో పాటు పలువరు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
తొలి సన్నివేశానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, సురేందర్ రెడ్డిలు దర్శకుడు గోపిచంద్ మలినేని స్క్రిప్ట్‌ను అందించారు `డాన్‌శీను`, `బలుపు` లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ క్రాక్ మూవీ ఆశించిన విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.