గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2019 (13:00 IST)

మళ్లీ వెనక్కి తగ్గిన "డిస్కోరాజా"... జనవరి 24న వస్తాడట...

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరో రవితేజ. ఈయన తాజాగా చిత్రం డిస్కోరాజా. వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమెతో పాటు.. నభా నటేష్, తాన్యా హోప్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రం వచ్చే నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకురావాల్సివుంది. కానీ, జనవరి 24వ తేదీకి వాయిదావేశారు. వీఎఫ్ఎక్స్ పూర్తి కాక‌పోవ‌డంతో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 24న మూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అధికారికంగా ప్రకటించారు. 
 
వీఎఫ్ఎక్స్‌కి సంబంధించిన వ‌ర్క్ ఇంకా జ‌రుగుతుంది. తొంద‌ర‌ప‌డి సాదాసీదాగా ఉండే ఔట్‌పుట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాలేము. అందుకే సినిమాని త‌ప్ప‌క వాయిదా వేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. జ‌న‌వ‌రి 24న మీకు డిస్కోరాజాతో మంచి వినోదాన్ని క‌లిగిస్తాము అని నిర్మాత‌లు పేర్కొన్నారు. 
 
సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా ఈచిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకునివున్నారు.