డిస్కోరాజా కోసం రంగంలోకి హాలీవుడ్ టీమ్.. ఐస్ ల్యాండ్‌లో షెడ్యూల్
మాస్ మహారాజా రవితేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా డిస్కో రాజా. ప్రముఖ నిర్మాత రామ్ తళ్ళూరి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ డిస్కో రాజా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. బడ్జెట్ విషయం లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను చిత్రీకరిస్తున్న చిత్ర బృందం, తాజాగా గోవాలో 15 రోజులు పాటు కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేసుకొని వచ్చింది.
మాస్ మహారాజ్ రవి తేజ కెర్రిర్ లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు గా డిస్కో రాజా టీం చెబుతుంది. ఈ నేపథ్యంలో గోవ షెడ్యూల్ ముగించుకొని ప్రస్తుతం ఫారిన్ వెళ్లేందుకు డిస్కో రాజా టీం రెడీ అవుతున్నట్లు నిర్మాత రామ్ తళ్ళూరి తెలిపారు. యూరోప్ లోని ఐస్ ల్యాండ్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రకరించాడనికి ప్లాన్ చేసినట్లు చెప్పారు.
ఈ షెడ్యూల్ కోసం భారీ గా ఖర్చు చేస్తున్నట్లుగా డిస్కో రాజా టీం చెబుతుంది. ఇక అసలు విషయానికి వస్తే... ఐస్ ల్యాండ్‌లో జరగనున్న ఈ షెడ్యూల్‌లో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫాస్ట్ అండ్ ఫురియెస్ 7 కోసం పనిచేసిన యాక్షన్ స్టంట్ మాస్టర్స్, అలానే పలు ఇంటర్నేషనల్ సినిమాలకు పని చేసిన ఊలి టీం డిస్కో రాజా కోసం రంగం లోకి దిగబోతున్నారు.
సినిమాకి హైలైట్ గా ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయి అని డిస్కో రాజా టీం చెబుతుంది. దీంతో డిస్కోరాజా పై మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి... బాక్సాఫీస్ వద్ద ఈ రాజా ఏం చేస్తాడో చూడాలి.