గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 23 జులై 2019 (22:14 IST)

మాస్‌మ‌హ‌రాజ్ డిస్కోరాజా కోస అంత ఖ‌ర్చు పెట్టి సెట్ వేస్తున్నారా..?

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం డిస్కోరాజా. ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణా ఏడెక‌రాల‌లో కోటి 20 ల‌క్ష‌ల రూపాయిల సెట్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకి ఈ సెట్ చాలా కీల‌క‌పాత్ర పోషిస్తుంది. 
 
ఈ షెడ్యూల్లో ర‌వితేజ‌, వెన్నెల కిషోర్‌, శశిర్ ష‌ర‌మ్‌, టోనిహొప్‌లపై సినిమాలో అతి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ సెట్‌ని డైర‌క్ట్‌గా థియెట‌ర్లో చూస్తే ప్రేక్ష‌కులు ఫీలింగ్ కొత్తగా వుంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆలోచ‌న. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నేల టిక్కెట్ తర్వాత ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి రవితేజతో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. త్వ‌ర‌లో ఢిల్లి లో షూటింగ్ చేయ‌నున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ... నేల టిక్కెట్ తర్వాత మాస్ మహారాజా రవితేజ గారితో మేం నిర్మిస్తున్న రెండో చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్లో రవితేజ గారు, వెన్నెల కిషోర్ల మ‌ద్య జ‌రిగే కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాం. 
 
ఈ షెడ్యూల్ ఈ నెల 26లో పూర్తిచేసుకుంటాం. ఆగ‌ష్టు మెద‌టివారం నుండి ఢిల్లిలో షూటింగ్ జ‌రుపుకుంటాం. ఈ షెడ్యూల్లో న‌భా న‌టేష్ జాయిన్ అవుతారు. ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ చాలా గొప్ప విజ‌న్ వున్న వ్య‌క్తి. ఈ చిత్రం పూర్తి వినోదాత్మ‌కంగా విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్ట‌కుంటుంది అని న‌మ్ముతున్నాం అని అన్నారు.