బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 14 జులై 2019 (16:58 IST)

అదితిరావుపై మనసుపడిన మాస్ మహారాజా

'సమ్మోహనం' బ్యూటీ అదితిరావు హైదరీ. ఈమెపై టాలీవుడ్ మాస్‌ మహారాజాపై రవితేజ మనసుపడ్డారు. తన తదుపరి చిత్రంలో ఆమెను బుక్ చేసుకున్నారు. కాగా, అదితిరావు హైదరీ సమ్మోహనం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రవితేజ తన 25వ చిత్రానికి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 
 
ఈ చిత్రానికి "ఆర్ఎక్స్100" దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి మహాసముద్రం అనే పేరు పెట్టారు. సెప్టెంబర్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.