శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (19:59 IST)

రష్మిక మందన అంత తీసుకుంటోందా? (video)

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతని అక్షరాలా పాటించే వాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది సినీ పరిశ్రమలోని వాళ్లు మాత్రమే. కాస్త క్రేజ్ ఉన్నప్పుడే మూటలు కొద్దీ డబ్బు వెనకేసుకొని లైఫ్‌లో సెటిల్ అయిపోవాలనే ఆలోచనతో నిర్మాతలను ఎడాపెడా వాయించేస్తూంటారు. తాజాగా రష్మిక కూడా ఇదే పనిలో ఉందంటున్నారు సినీ జనాలు. 
 
గీత గోవిందం సినిమాతో మంచి పేరు తెచ్చేసుకున్న రష్మిక.. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటించేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరూలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈవిడకి.. తాజాగా తమిళంలో విజయ్ 64వ చిత్రంగా తెరకెక్కనున్న సినిమాలో ఛాన్స్ దక్కిందట. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా కూడా మరో హీరోయిన్‍గా నటిస్తోందట.
 
కాగా ఈ సినిమా కోసం రష్మిక భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు కోటి రూపాయిలు డిమాండ్ చేసిందనీ… అయితే ఆవిడ అడిగినంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు కూడా సిద్ధం అయ్యారనీ సమాచారం.