స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రజనీకాంత్.. బుంగబూతి పెట్టుకున్న నయనతార (video)

Last Updated: శుక్రవారం, 14 జూన్ 2019 (18:32 IST)
బాయ్‌ఫ్రెండ్ విషయంలో నయనతారకు సూపర్ స్టార్ రజనీకాంత్ గట్టి వార్నింగ్ ఇచ్చారట. లేడీ సూపర్ స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి చంద్రముఖిలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మురుగదాస్ సినిమాలోనూ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. 
 
నయనతార అంటే రజినీకాంత్‌కు ప్రత్యేక గౌరవం ఉంది. అలాంటిది ఓ విషయంలో నయన్‌పై రజనీకాంత్ సీరియస్ అయ్యారని కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నయనతార, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో లవ్ ఎఫైర్‌లో వున్న సంగతి తెలిసిందే. అయితే తమ బంధం గురించి ఈ జంట మాత్రం నోరు మెదపడం లేదు. వీరికి ఇదివరకే పెళ్లైపోయిందనే వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా నయనతార తన బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌ను దర్బార్ సినిమా షూటింగ్‌లో రజనీకాంత్‌కు పరిచయం చేసిందట. 
 
అంతటితో ఆగకుండా విఘ్నేశ్‌తో సినిమా చేయాలని రజనీపై ఒత్తిడి తెచ్చిందట. విఘ్నేష్ మంచి దర్శకుడు అంటూ రజనీకు ఖాళీ దొరికినప్పుడల్లా అడగడం మొదలెట్టిందట. ఈ మధ్య తరచూ విఘ్నేష్‌తో సినిమా చేయాలని కథ వినాలని ఇబ్బంది పెట్టిందట. 
 
దీంతో రజనీకాంత్‌కు కోపం వచ్చిందని.. పర్సనల్‌కు ప్రొఫెషనల్‌కు లింకు పెట్టవద్దని నయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నోరెత్తలేక నయనతార బుంగమూతి పెట్టుకుందని టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే.. నయన నోరు విప్పాల్సిందే. 
 దీనిపై మరింత చదవండి :