గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 21 జూన్ 2019 (19:42 IST)

హ్యాట్రిక్ ఫ్లాప్ కొట్టావ్.. ఈసారైనా స‌క్స‌ెస్ సాధిస్తావా నితినా..?

యువ హీరో నితిన్ న‌టించిన లై, ఛ‌ల్ మోహ‌న రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం... ఇలా వ‌రుస‌గా మూడు సినిమాలు హ్యాట్రిక్ ఫ్లాప్ అవ్వ‌డంతో కెరీర్లో బాగా వెన‌క‌బ‌డ్డాడు. దీంతో కొన్ని రోజులు ఆలోచ‌న‌లో ప‌డి ఏ సినిమాని ఓకే చేయ‌లేదు. ఆఖ‌రికి ఈసారి ఎలాగైనా స‌రే... స‌క్స‌స్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో క‌థ‌ల విష‌యంలో చాలా కేర్ తీసుకున్నాడు.
 
చాలా క‌థ‌లు విని ఆఖ‌రికి ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుమ‌ల‌తో భీష్మ సినిమా చేయ‌డానికి అంగీక‌రించాడు. ఈ సినిమాని ఎప్పుడో ఎనౌన్స్ చేసారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న సెట్స్ పైకి వెళ్ల‌డం ఆల‌స్యం అయ్యింది. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తుంది. ఎట్ట‌కేల‌కు భీష్మ షూటింగ్ ప్రారంభించారు. 
 
ఈ సంద‌ర్భంగా నితిన్ ట్విట్ట‌ర్లో స్పందిస్తూ... దాదాపు సంవ‌త్స‌రం త‌ర్వాత కెమెరా ముందుకు వచ్చాను. న్యూ డే, న్యూ లుక్, న్యూ క్యారెక్ట‌ర్.. ఈ ప్ర‌యాణం చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. భీష్మ షూటింగ్ బిగిన్స్ అంటూ త‌న సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఐ యామ్ బ్యాక్ అంటూ కెమెరా ముందుకు వ‌చ్చావు స‌రే... స‌క్స‌స్ సాధిస్తావా నాయ‌నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.