నితిన్‌ను ఎగతాళి చేస్తున్న నెటిజన్స్... ఎందుకు?
యువ హీరో నితిన్ నటించిన లై, ఛల్ మోహన రంగ, శ్రీనివాస కళ్యాణం... చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో కెరీర్లో బాగా వెనకబడిపోయాడు. దీంతో ఆలోచనలో పడ్డ నితిన్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడట. అయితే... ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే సినిమా చేయనున్నాడు.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ఈ మూవీ ఎనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులయ్యింది కానీ... ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు. కారణం ఏంటంటే... కథపై ఇంకా కసరత్తులు చేస్తున్నారట. ఈ సినిమాతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు కానీ.. ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.
తాజాగా తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ సినిమా చేయనున్నాడని... ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు ఎనౌన్స్ చేసిన మూడు చిత్రాల తర్వాత వెంకీ అట్లూరితో సినిమా ఉంటుందా..? లేక ముందుగానే వెంకీ అట్లూరితో సినిమా చేస్తాడా..? అనేది తెలియాల్సివుంది. ఇలా వరుసగా నితిన్ సినిమాలను ఎనౌన్స్ చేయడం చూసి నెటిజన్లు.. ఎనౌన్స్‌మెంట్‌లేనా..? సెట్స్ పైకి వెళ్లేది లేదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఎగతాళి చేస్తున్నారు. మరి...ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో నితిన్ కే తెలియాలి.