శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 29 జూన్ 2019 (09:18 IST)

నిర్మాతల ఈగోనే కానీ... నా తప్పు కాదు అంటున్న అమలాపాల్

అమలా పాల్.... తెలుగులో అవకాశాలు తగ్గిపోయి చాలాకాలమే అయినప్పటికీ, తమిళంలో మాత్రం ఎడాపెడా అవకాశాలను దక్కించుకుంటూనే వుంది. అయితే... తాజాగా విజయ్ సేతుపతితో ఒక కొత్త సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన అమలా పాల్‌ను సదరు నిర్మాతలు, ఆ తర్వాత ఆ స్థానంలోకి మేఘా ఆకాశ్‌ను తీసుకున్నారు. ఇది రకరకాల ఊహాగానాలకు, చర్చలకు దారితీసిన విషయం తెలిసిందే.
 
వీటిపై అమలాపాల్ స్పందిస్తూ, "నిర్మాతలకి సహకరించననే కారణం చెప్పి నన్ను ఈ ప్రాజెక్టు నుంచి తీసేసారు. వాళ్లు అలా అనేసరికి నాపై నాకే అనుమానం వచ్చి కెరీర్ పరంగా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాను. నా వల్ల నిర్మాతలకి ఇబ్బంది కలగకుండా నడచుకున్న సంఘటనలే నాకు కనిపించాయి తప్ప నేను నిర్మాతలను ఇబ్బంది పెట్టిన సంఘటనలు లేవు. ఈ సినిమా నిర్మాతలు నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇది నా తప్పుకాదనీ.. నిర్మాతల ఈగో ప్రోబ్లమ్ అని నాకు అర్థమైంది" అని చెప్పుకొచ్చింది.
 
అది నిర్మాతల ఈగోనో... లేక హీరోయిన్ దురదృష్టమో కానీ మొత్తం మీద అవకాశాలే లేకుండా ఎదురుచూస్తున్న మేఘా ఆకాశ్‌కి ఇది ఒక మంచి అవకాశమనే చెప్పుకోవాలి.