సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 20 జూన్ 2019 (19:22 IST)

కామిని ఇచ్చిన ఆ ఫోజు తొలగింపు.. (Video)

కోలీవుడ్ నటి, ఇద్దరమ్మాయిలతో ఫేమ్ అమలాపాల్ తాజా సినిమా ''ఆడై''కి సెన్సార్ బోర్డు ''ఎ'' సర్టిఫికేట్ ఇచ్చింది. రత్నకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా.. మహిళల జరిగే అకృత్యాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో అమలాపాల్ లీడ్ రోల్ కామినిగా నటిస్తోంది. ప్రదీప్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. 
 
ఈ సినిమా టీజర్ మంగళవారం విడుదలైన నేపథ్యంలో.. ఈ సినిమాలో అమలాపాల్ నటనకు గాను ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బోల్డ్‌గా నటిస్తూ ఇంతవరకు ఏ హీరోయిన్‌నూ చేయని సాహసం చేసింది. నగ్నంగా నటించి ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ఈ సినిమాకు ''ఎ'' సర్టిఫికేట్ ఇచ్చింది. ప్రస్తుతం అమలాపాల్ ఆడైకి ఎందుకు ''ఎ'' సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చిందనే దానిపై క్లారిటీ ఇచ్చింది. ఇంకా తొలగించిన దృశ్యాలకు సంబంధించిన వివరాలను కూడా జతచేసింది. 
 
అవేంటంటే...? 
అశ్లీల పదాలు వచ్చిన డైలాగుల వద్ద మ్యూట్ చేయడం జరిగింది
ఇంకా నగ్న సన్నివేశాలను ట్రిమ్ చేశారు. డీ ఫోకస్ చేయడం జరిగింది. 
అలాగే అద్దాల కిటికీ వద్ద కామిని నగ్నంగా నిలబడే సన్నివేశాన్ని తొలగించారు.  
 
ఇంకా శివలింగం అనే పదం వచ్చే సన్నివేశాలను తొలగించారు. లింగం అనే పదాన్ని కూడా మ్యూట్ చేశారు. సైడ్ ఫోజులో కామిని నగ్నంగా కూర్చుని వుండే సన్నివేశాలను కూడా తొలిగించనట్లు సెన్సార్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.