శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (12:59 IST)

అమలా పాల్ అవకాశాన్ని కొట్టేసిన మేఘా ఆకాశ్

మేఘా ఆకాశ్‌... తెలుగులో నటించిన తొలి రెండు సినిమాలు భారీ పరాజయాలను చవిచూడటంతో, సహజంగానే అవకాశాలపై ఆశలు వదిలేసింది. అయితే ఇప్పుడిప్పుడే ఆవిడపై ఆ పరాజయాల ప్రభావం తొలగిపోతూ అవకాశాలు ఆమెను పలకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళంలో నిలదొక్కుకోవడానికి మేఘా ఆకాశ్ గట్టి ప్రయత్నాలే చేస్తోందట.
 
తాజాగా... ఆమె ప్రయత్నాలు ఫలించి, విజయ్ సేతుపతి సరసన ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. వెంకటకృష్ణ దర్శకత్వంలో విజయ్ సేతుపతి తన 33వ సినిమాతో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా.. ఈ సినిమాలో, ముందుగా అమలా పాల్‌ను తీసుకున్నప్పటికీ... కొన్ని కారణాంతరాల వలన ఆవిడ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో, ఆవిడ స్థానంలో మేఘా ఆకాశ్‌ను తీసుకున్నారని వినికిడి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమా అయినా మేఘా ఆకాశ్ ఆశలు నెరవేర్చుతుందో లేదో వేచి చూడాల్సిందే.