గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (18:16 IST)

'యు' సర్టిఫికేట్ ట్రై చేశా... ఇక 'ఏ' సర్టిఫికేట్ చూపిస్తా : రకుల్ (video)

తన ఖాతాలో సరైన హిట్స్ లేకపోయినప్పటికీ... వరుస ఆఫర్లు కొట్టేస్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈమె తాజాగా నటిస్తున్న చిత్రం 'మన్మథుడు-2'. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న చిత్రం. గతంలో వచ్చిన 'మన్మథుడు'కు ఈ చిత్రం సీక్వెల్. తన సొంత నిర్మాణ సంస్థపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రంలో అవంతిక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ పాత్రలో ఆమె బోల్డ్‌గా నటించింది. సిగరెట్ పీల్చడం, మద్యం సేవించడం, అందాలు ఆరబోయడం వంటి సన్నివేశాల్లో నటించినట్టు తెలుస్తోంది. ఈ పాత్రకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేయగా, ఇది సందడి చేస్తోంది. ఇందులోని డైలాగ్స్‌ను పరిశీలిస్తే, 
 
'అవంతిక పేరు ఎంత విన‌సొంపుగా ఉంది.. అంతే ప‌ద్ధ‌తి గ‌ల అమ్మాయి' అని ల‌క్ష్మి చెప్పే డైలాగ్‌తో పాటు సంప్ర‌దాయబ‌ద్ధమైన లుక్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ ప్రోమోలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తుంది. అలాగే హాట్ లుక్‌లోనూ క‌న‌ప‌డి కనువిందు చేసింది. 
 
'ఇప్ప‌టివ‌ర‌కు యు సర్టిఫికెట్ ట్రై చేశాను. ఇక‌పై ఏ స‌ర్టిఫికెట్ చూపిస్తా..' అంటూ నాగ్‌తో రకుల్ చెప్పే డైలాగ్‌తో పాటు ర‌కుల్ సిగ‌రెట్ తాగి పొగ వ‌దిలే సీన్‌లో క‌న‌ప‌డింది. ఈ సీనే ఈ ప్రోమోలో హైలైట్‌గా నిలుస్తుంది. 'ఈమెను మీరు ప్రేమిస్తారు లేదా ద్వేషిస్తారు' అనే లైన్‌తో ర‌కుల్ చేసిన అవంతిక పాత్ర‌ను తెలియ‌జేసింది చిత్ర యూనిట్‌. వచ్చే నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ చిత్రంలో నాగార్జున ప్లేబాయ్‌గా నటించాడు.