బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (17:19 IST)

రవితేజ ఇలా మారిపోయాడే..? (photo)

మాస్ మహారాజ రవితేజ యంగ్ అయిపోయాడు. వరుస ఫ్లాపులతో విసిగిపోయిన రవితేజ త్వరలో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. గతేడాది ట‌చ్ చేసి చూడు, నేల‌టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాల‌తో వచ్చినా ఫలితం మాత్రం అంతంత మాత్రమే.
 
"రాజా ది గ్రేట్"తో రెండేళ్ల త‌ర్వాత వ‌చ్చి హిట్ కొట్టిన ఈ హీరో.. ఆపై మాత్రం హిట్ కొట్టలేకపోయాడు. తాజాగా రవితేజ ''డిస్కో రాజా'' సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ రెండు షేడ్స్ వున్న పాత్రలు చేస్తున్నట్టు సమాచారం. 
 
అందులో ఒక పాత్ర కోసం రవితేజ.. మరి యంగ్‌గా కనిపించాలి. దీనికోసం మాస్‌రాజా బాగానే వర్కౌట్ చేసి తన లుక్‌ను మార్చుకున్నాడు. ప్రస్తుతం యంగ్‌గా మారిన రవితేజ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి.