ఎల్ఐసీ అసిస్టెంట్ ఎగ్జామ్ 2019: అక్టోబర్ 30, 31 తేదీలకి పరీక్షలు వాయిదా
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు లక్షలాది మంది దరఖాస్తు చేశారు. అక్టోబర్ 21, 22 తేదీల్లో జరగాల్సిన ప్రిలిమ్స్ పరీక్షల్ని అక్టోబర్ 30, 31వ తేదీలకు వాయిదా వేస్తూ ఎల్‌ఐసీ ప్రకటించింది. దీంతో ప్రిపరేషన్‌కు అభ్యర్థులకు మరో 15 రోజుల గడువు లభించింది.
డిగ్రీ అర్హతతో 7871 అసిస్టెంట్ పోస్టుల్ని ఎల్ఐసీ భర్తీ చేస్తోంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎల్ఐసీ అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ఇంగ్లీష్ లేదా హిందీ భాషలో 30 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీలో 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలుంటాయి.
ఇక ఎల్ఐసీ అసిస్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌లో 40 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్‌లో 40 ప్రశ్నలు, క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్‌లో 40 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో 40 ప్రశ్నలు, హిందీ భాషలో 40 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు.