మీ ఆతిథ్యం అమితానందానికి గురిచేసింది : జీ జిన్‌పింగ్
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆతిథ్యానికి మంత్రమగ్ధులయ్యారు. ఈ పర్యటనలో భాగంగా, ప్రధాని మోడీ - జిన్‌పింగ్‌లు శనివారం మహాబలిపురం సముద్రతీరంలో ఉన్న ఓ నక్షత్ర హోటల్‌లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు.
ఈ భేటీలో చైనా అధినేత మాట్లాడుతూ, 'మీరు ఇచ్చిన ఆతిథ్యం మమ్మల్ని అమితానందానికి గురి చేసింది. నేను, మా అధికారులంతా ఇదే ఫీలింగ్‌తో ఉన్నాం. ఈ అనుభవాలు.. తనకు, తన బృందానికి చిరకాల స్మృతులగా మిగిలిపోతాయి అని జిన్‌పింగ్ అన్నారు.
అలాగే, శుక్రవారం మహాబలిపుంలో జరిగిన సమావేశం గురించి కూడా జిన్‌పింగ్ గుర్తు చేశారు. మామల్లపురంలో మనం ఇద్దరు స్నేహితుల్లా మాట్లాడుకున్నట్టు వెల్లడించారు. ద్వైపాక్షిక సంబంధాలపై మనస్ఫూర్తిగా చర్చించుకున్నామని జిన్‌పింగ్ చెప్పారు.