#1 ON TRENDING డిస్కో రాజా టీజర్ (Video)
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా డిస్కో రాజా. పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా టీజర్ నెట్టింటిని షేక్ చేస్తోంది. టీజర్‌ని బట్టి చూస్తుంటే కొంత సైన్స్ ఫిక్షన్ జానర్‌లో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ టీజర్ చివరిలో రవితేజ ఫ్రీకవుట్ అంటూ చెప్పే డైలాగ్ బాగుంది. టీజర్ లో విజువల్స్ ఎంతో గ్రాండ్‌గా ఉండడంతో పాటు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని కూడా అదరగొట్టాడు. మొత్తంగా ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో అద్భుతమైన వ్యూస్‍తో దూసుకుపోతోంది.
గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు తెరకెక్కించిన విఐ ఆనంద్, ప్రస్తుతం ఈ డిస్కో రాజా సినిమా కథను కూడా పూర్తిగా డిఫరెంట్ జానర్లో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకేముంది.. తాజాగా విడుదలైన డిస్కో రాజా టీజర్‌ను ఓ లుక్కేయండి.