శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 15 నవంబరు 2019 (16:52 IST)

నాకు అలా చేయడం తెలియదు, రామ్ బాగా నేర్పించాడు - నభా నటేష్

ఒకే ఒక్క సినిమాతో నభా నటేష్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలంగాణా యాసలో మాట్లాడుతూ మాస్ అమ్మాయిగా మెప్పించింది. హీరో రామ్‌కు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఎంత పేరు వచ్చిందో నభా నటేష్‌కు అంతే పేరు వచ్చింది. నభా ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ విజయాన్ని ఆస్వాదిస్తూనే ఉంది.
 
దర్సకుడు పూరీ జగన్నాథ్ ఇంకో సినిమా ప్లాన్ చేసుకుంటుంటే నభా నటేష్ మాత్రం ఇస్మార్ట్ శంకర్‌తో తనకు ఇచ్చిన అవకాశాన్ని గుర్తు చేసుకుంటూ రామ్, పూరీ జగన్నాథ్‌లను పొగడ్తలతో ముంచెత్తుతోంది. నేను చిన్నప్పటి నుంచే ఎనర్జిటిక్ , డామినేటింగ్‌గా ఉండేదాన్ని.
 
అలా అని అంత మాస్ అమ్మాయిని కాదు. అయితే నన్ను అలా చూపించారు పూరీ జగన్నాథ్. రామ్ మాస్ అమ్మాయిగా ఎలా చేయాలో చెప్పారు...చెప్పించారు..చేసి చూపించారు. అందుకే అలా చేయగలిగానంటోంది నభా నటేష్. నాకు ఆ హీరో.. ఈ హీరో అని కొంతమందితోనే కలిసి నటించాలని గీత గీసుకుని కూర్చోలేదు. అందరితోను నటిస్తాను. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన డిస్కోరాజా సినిమాలో నటిస్తోంది. మరికొన్ని అవకాశాలు నభా నటేష్‌కు వస్తున్నాయి.