గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 నవంబరు 2019 (10:45 IST)

అల.. వైకుంఠపురములో.. ఓ మై గాడ్ డాడీ.. అంటోన్న బన్నీ కిడ్స్ (Video)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'అల.. వైకుంఠపురములో..' చిత్రానికి సంబంధించి మరో టీజర్‌ విడుదలైంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి మూడోపాట టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా గురువారం విడుదల చేసింది. 
 
'ఓ మైగాడ్‌ డాడీ' అంటూ సాగే ఈ పాట టీజర్‌లో బన్నీ కుమారుడు అల్లు అయాన్‌తోపాటు కుమార్తె అల్లు అర్హ ముద్దుగా డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. బన్నీ సర్‌ప్రైజ్‌ చాలా క్యూట్‌గా ఉందని సినీ అభిమానులు అంటున్నారు.
 
ఇకపోతే.. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం పారిస్‌లో సాంగ్ షూట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ మూవీ కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.