సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (20:25 IST)

అడిషన్స్‌కు వెళితే... గదిలో పడక మంచం వేసి... బోరుమన్న హీరోయిన్

బాలీవుడ్ నటి మాన్వి గాగ్రూ బోరుమని ఏడ్చేసింది. అడిషన్స్‌కు వెళ్లినపుడు జరిగిన సంఘటనను తలచుకుని ఆమె కన్నీరు పెట్టుకుంది. అవకాశాల కోసం అడిషన్స్‌కు వెళితో గదిలో పడక మంచం వేసి అత్యాచారయత్నానికి పాల్పడ్డారని చెప్పుకొచ్చింది.
 
ఇదే అంశంపై ఆమె తాజాగా స్పందిస్తూ, 'ఓ సినిమాలో అవకాశం కోసం ఆడిషన్స్‌కు వెళ్లాను. చెత్తగా ఉన్న ఓ ఆఫీసులో నన్ను అత్యాచారం యత్నం సన్నివేశంలో నటించమని కోరారు. అది ఆఫీసులాగా లేదు. గదిలో పడక మంచం మాత్రమే ఉంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితి చూసి నేను భయంతో వెనక్కి చూడకుండా బయటకు పరుగుతీశా' అని చెప్పుకొచ్చింది.
 
మాన్వి 'ఉజ్జా చమన్' చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఎక్కువ బరువు, లావుగా ఉన్న అమ్మాయిగా కనిపించిన మాన్వి బట్టతల ఉన్న హీరోను ఇష్టపడే అమ్మాయిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సన్నీసింగ్ హీరోగా నటించిన ఈ సినిమాకు అభిషేక్ పాథక్ దర్శకత్వం వహించారు.