శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (11:54 IST)

''జాను'' సినిమా చూస్తూ వ్యక్తి మృతి.. ఆ కథ గుండెను పిండేసిందా?

హైదరాబాద్ థియేటర్లో విషాదం చోటుచేసుకుంది. సమంత, శర్వానంద్ జంటగా నటించిన జాను సినిమాను చూస్తూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సమంత, శర్వానంద్ జంటగా నటించిన ‘జాను’ సినిమా విడుదల కావడంతో మ్యాట్నిషో చూసేందుకు ఓ వ్యక్తి థియేటర్‌కు వచ్చాడు.

ఈ సినిమా పూర్తయ్యాక కూడా సీట్లో నుంచి అతను కదల్లేదు. దీంతో అది చూసిన థియేటర్ సిబ్బంది నిద్రపోయాడేమోనని అతడ్ని లేపేందుకు గట్టిగా కేకలు వేశారు. 
 
ఎంతగా పిలిచినా అతడు స్పందించకపోవడంతో దగ్గరకు వెళ్లి చూశారు. కానీ అతడు సీటులోనే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

థియేటర్‌కు వచ్చిన ఎస్‌ఐ మహేందర్‌ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని గాంధీ మార్చురీకి తరలించారు. అయితే అతడి పాకెట్లో ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.