గబ్బర్ సింగ్ సెంటిమెంట్.. పవన్ కళ్యాణ్‌కు హీరోయిన్ ఎంపిక! (Video)

shruti haasan
ఠాగూర్| Last Updated: గురువారం, 6 ఫిబ్రవరి 2020 (17:52 IST)
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'గబ్బర్ సింగ్'. ఇందులో శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే, కాంబినేషన్ మరోమారు రిపీట్ కానుంది.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సినిమాల్లో నటించాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, "పింక్" రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మరో నాలుగైదు చిత్రాల్లో నటించేందుకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం.

అందులో ఒకటి మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో నిర్మించే చిత్రం. ఈ చిత్రానికి హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించనున్నారు. ఈ చిత్రం కోసం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

అయితే, తాజా సమాచారం మేరకు ప‌వ‌న్‌తో హరీశ్ శంకర్ చేసిన 'గ‌బ్బ‌ర్ సింగ్' సెంటిమెంట్‌నే ఫాలో అవ‌బోతున్నాడ‌ని టాక్‌. దాని ప్ర‌కారం ప‌వ‌న్ స‌ర‌స‌న శృతిహాస‌న్‌నే హీరోయిన్‌గా తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌.

చాలా గ్యాప్ త‌ర్వాత శృతిహాస‌న్ క్రాక్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో నటిస్తుంది. ఇది నిజమైతే 'గబ్బర్ సింగ్', 'కాటమరాయుడు' తర్వాత శృతిహాసన్ నటించనున్న చిత్రం తర్వాత ఇదే అవుతుంది.

దీనిపై మరింత చదవండి :