శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (18:06 IST)

పవన్ ఎప్పుడు విమానం ఎక్కితే అప్పుడు రెడీ... దిల్ రాజు దమ్మంటే అదీ...

పవన్-దిల్ రాజు
టాలీవుడ్ నిర్మాతల్లో దిల్ రాజు స్టయిలే సెపరేట్. ఆయన ఓ చిత్రాన్ని తీయాలి అనుకున్నారంటే ఇక వెనక్కి తిరిగి చూస్కోరు. ఒక్కసారి కమిటైతే తనమాట తనే వినడన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో పింక్ చిత్రం రీమేక్ విషయంలోనూ అదే జరుగుతోందంటున్నారు టాలీవుడ్ సినీజనం. 
 
ముఖ్యంగా రాజకీయాల్లో పూర్తిగా తలమునకలై వున్న పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడం అంటే మాములు విషయం కాదు. పైగా పవన్ కళ్యాణ్ తను పార్టీ సమావేశాలతో బిజీగా వుంటాననీ, ఏదో ఒకటిఅరా రోజులు ఖాళీ దొరకొచ్చనీ, ఆ రోజుల్లో తను కాల్షీట్లు ఇచ్చేందుకు సిద్ధమన్నారట.
 
ఐతే ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కార్యకర్తలతో సమావేశాలతో బిజీగా వుంటున్న పవన్ డైలీ హైదరాబాద్ టు అమరావతి ప్రయాణం చేస్తున్నారట. అది కూడా విమానాల్లో. పవన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లేందుకు దిల్ రాజు ఆయన కోసం విమానం టిక్కెట్లు పట్టుకుని రెడీగా వుంటున్నారట. మొత్తమ్మీద పవనిజం గురించి దిల్ రాజు బాగా అర్థం చేసుకున్నట్లున్నారు కదూ.