సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (17:34 IST)

#పవన్ సరసన ప్రగ్య.. వరుసగా మూడు సినిమాల్లో పవర్ స్టార్.. (video)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్‌‍లో కనిపించనున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీ బిజీగా వుంటూనే పవన్.. సినిమాల్లోకి వస్తున్నారు. ఇప్పటికే వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో పింక్‌ రిమేక్‌‌లో నటిస్తున్న పవన్ కల్యాణ్, మళ్లీ ఓ సినిమాకు సైన్ చేశారని తెలిసింది. పవన్ పింక్‌ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. 
 
తమిళంలో కూడా హిట్‌ సాధించిన పింక్‌ రిమేక్‌ను పవన్‌ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంజలి, నివేదా థామస్‌, అనన్య పాండేలు నటిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయాలని దిల్‌ రాజు భావిస్తున్నారట. 
 
కాగా, ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే మరో చిత్రాన్ని కూడా సెట్స్‌ పైకి తీసుకెళ్లె పనిలో పవన్‌ ఉన్నట్లు సమాచారం. ఎప్పటినుంచో క్రిష్‌తో సినిమా చేయాలనుకుంటున్న పవన్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో పవన్‌ సరసన "కంచె" ఫేమ్‌ ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేసినట్లు టాక్ వస్తోంది. ఈ చిత్రంలో మంచి కోసం పరితపించే ఓ దొంగ పాత్రలో పవన్‌ నటించనున్నట్లు సమాచారం.

ఇక ఈ రెండు చిత్రాలతో పాటు పూరి జగన్నాథ్‌ చిత్రం కూడా లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల్లోకి పవన్‌ రీఎంట్రీతో పవర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.