శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (17:46 IST)

#JaanuTeaser చాలా దూరం వెళ్లాసావురా.. నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే..?! (వీడియో)

కోలీవుడ్ బంపర్ హిట్ మూవీ 96 తెలుగులో ''జాను''గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్రిష, విజయ్‌ సేతుపతి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 96ను తెలుగులోకి జానుగా రీమేక్ చేస్తున్నారు. 96 ఇప్పటికీ పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు నిర్మాతగా రీమేక్‌ చేస్తున్నారు. త్రిష, విజయ్‌ సేతుపతి నటించిన పాత్రల్లో తెలుగులో సమంత, శర్వానంద్‌లు నటిస్తున్నారు. 
 
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో పాటు టైటిల్‌ లోగోను రివీల్‌ చేశారు. ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జాను అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఎలాంటి హడావిడి లేకుండా ఓ సింపుల్‌ పోస్టర్‌తో టైటిల్‌ను ఎనౌన్స్‌ చేశారు. ఈ పోస్టర్‌లో ఎడారిలో నిల్చున్న ఒంటెలు.. వాటి ముందు శర్వానంద్ నిల్చుని వున్నట్టుంది.
 
తాజాగా జాను నుంచి టీజర్ విడుదలైంది. గోవింద్ వసంత ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను మహేంద్రన్ జయరాజు నిర్వర్తిస్తారు. ఈ నేఫథ్యంలో జాను టీజర్‌ భావోద్వేగాల మధ్య విడుదైంది. సమంత, శర్వానంద్‌ల ఎమోషనల్ పండింది. ''చాలా దూరం వెళ్లాసావురా.. నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే వున్నాను.. అంటూ సమంత, శర్వానంద్ డైలాగ్స్ బాగున్నాయి. ఇంకేముంది.. జాను టీజర్‌ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.