గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 29 జనవరి 2020 (19:32 IST)

పవన్ కళ్యాణ్‌ని దిల్ రాజు మామూలుగా వాడుకోవడం లేదట... కానీ... (Video)

పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం పింక్ రీమేక్ చలనచిత్రం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తక్కువే కనుక కరెక్టుగా ప్లాన్ చేసి దిల్ రాజు సినిమాను తెరకెక్కించే విషయంలో సక్సెస్ అవుతున్నాడని అంటున్నారు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో బాగా యాక్టివ్ అయిపోయిన పవన్ కళ్యాణ్ నుంచి నటన రాబట్టడం మామూలు విషయం కాదు. 
 
పైగా పవన్ కళ్యాణ్ షాట్ రెడీ చెప్పే వరకూ కార్ వ్యాన్ లోపలి నుంచి బయటకు రావడంలేదట. ఎక్కువగా రాజకీయాలు గురించే విపరీతంగా ఆలోచన చేస్తున్నారట. దాంతో ఆ ప్రభావం ఆయన యాక్టింగ్ మీద పడుతోందని చెప్పుకుంటున్నారు. ఐతే అలాంటి యాక్షనే పింక్ రీమేక్ చిత్రానికి చక్కగా సెట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. 
 
మొత్తమ్మీద దిల్ రాజు ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయలేదు కానీ ఈ చిత్రం ద్వారా తన కోర్కెను తీర్చుకుంటున్నాడు. తనకు గంటల లెక్కలో కాల్షీట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్‌ను ఎలా వాడుకోవాలో అలా వాడేస్తున్నారట దిల్ రాజు.